
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, తుంగతుర్తి, వెలుగు : నూతన పరిశ్రమలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లో జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, టీజీ ఐపాస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ టీఎస్ ప్రైడ్ కింద 80 వాహనాలకు రాయితీ మంజూరు చేశామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. నిరుద్యోగులు డీఈఈటీ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశం లభిస్తాయని తెలిపారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి..
తెలంగాణ అవతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ రాంబాబులతో కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవంపై సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు వివరాలు ఈనెల 29వలోపు సీపీవోకు అందజేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరా మహిళాశక్తి, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలకు సంబంధించిన ఉత్తర్వులను లబ్ధిదారులకు జూన్ 2న అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి..
వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డీఎఫ్ వో సతీశ్ కుమార్ కన్వీనర్ గా జరిగిన వనమహోత్సవం, అటవీ రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 54 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. వర్షాకాలం మొదలైనందున జూన్ 10లోపే మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం జాజిరెడ్డగూడెం మండలంలోని పలు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయా సమావేశంలో డీఆర్డీవో అప్పారావు, ఆర్డీవోలు వేణు మాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీపీవో యాదగిరి, అధికారులు పాల్గొన్నారు.