IRCTC యాప్లో మెట్రో రైలు టికెట్లు : హైదరాబాద్లో ఎప్పుడు..?

IRCTC యాప్లో మెట్రో రైలు టికెట్లు : హైదరాబాద్లో ఎప్పుడు..?

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి మెట్రో రైలు టికెట్లను ఐఆర్సీటీసీ యాప్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని పొందొచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే IRCTCలో మెట్రో రైలు టికెట్ల సౌకర్యం ఢిల్లీ ప్రయాణికులకు మాత్రమే. 

IRCTCతో ఒప్పందం..

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐఆర్సీటీసీలో ఢిల్లీ మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వన్ ఇండియా వన్ టికెట్ కార్యక్రమంలో భాగంగా  ప్రయాణికుల సౌలభ్యం కోరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరింజ కార్పొరేషన్ తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఢిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. 

ప్రయాణీకులు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..?

  • వన్ ఇండియా వన్ టికెట్ ఇన్షియేటివ్ లో భాగంగా  IRCTC పోర్టల్ ద్వారా QR కోడ్ ఆధారిత టిక్కెట్‌ను DMRC  ప్రవేశపెట్టింది. 
  • IRCTC పోర్టల్ ద్వారా రైల్వే, విమాన టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు..ఢిల్లీ మెట్రో రైలు టికెట్లను DMRC QR కోడ్ యూజ్ చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. 
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టికెట్లను ఇండియన్ రైల్వే టికెట్ల మాదిరిగానే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవచ్చు. 
  • ఢిల్లీ మెట్రో QR టికెట్ ఐఆర్సీటీసీ ఎలక్ట్రానిక్ రిజర్వేషణ్ స్లిప్ మాదిరిగానే ఉంటుంది. దీనికి అదనంగా  ఫ్లాట్ ఫారం రుసుము రూ. 5ను వసూలు చేస్తారు.