ధరలను తగ్గించిన ఇన్ఫినిక్స్

ధరలను తగ్గించిన ఇన్ఫినిక్స్

న్యూఢిల్లీ:ఎలక్ట్రానిక్స్​ కంపెనీ ఇన్ఫినిక్స్​ ఫ్లిప్‌‌‌‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం తన స్మార్ట్‌‌‌‌ఫోన్ మోడల్స్​పై​ డిస్కౌంట్లు ప్రకటించింది. అక్టోబరు 15 వరకు తక్కువ ధరలకే ప్రొడక్టులు అమ్ముతామని తెలిపింది. స్మార్ట్​7 ఫోన్​ను కేవలం రూ. 5,810లకు అమ్ముతున్నామని తెలిపింది. ఇందులో  128 జీబీ మెమరీ,  4 జీబీ ర్యామ్​ ఉంటుంది. 

ఇన్ఫినిక్స్​ హాట్​30ఐ ఫోన్​లో128 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్​ ఉంటుంది. దీని ధరను రూ. 7319లకు తగ్గించింది.  నోట్​30 5జీ ఫోన్ ఇప్పుడు రూ.13 వేలకే దొరుకుతుంది. ఇందులో 256 జీబీ మెమరీ,  8 జీబీ ర్యామ్​ ఉంటాయి. హాట్ 30 5జీ,  జీటీ 10, జీరో 30 5జీ, హాట్ 20 ప్లే, నోట్​ 12ఐ, జీరో అల్ట్రా, నోట్​ 12 టర్బో, జీరో 5జీ ఫోన్లపైనా ఆఫర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.