వైసీపీకి షాక్: కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

వైసీపీకి షాక్: కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కిన అభ్యర్థులంతా ప్రచారాన్ని ప్రారంభించి జనంలోకి వెళ్తుండగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు. తనకు వైసీపీలో తీవ్ర అవమానం, అన్యాయం జరిగాయని, అందుకే  ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో తెలిపేరు కృపారాణి. గతంలో క్యాబినెట్ స్థాయి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో, మళ్లీ ఎందుకు తొలగించారో తెలియదని అన్నారు.

తనకు పార్టీకంటే గౌరవం ముఖ్యమని, గౌరవం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్తానని అన్నారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీ సీటు ఆశించిన కృపారాణికి టికెట్ దక్కలేదు. అయితే, ఈ ఎన్నికల్లో అయినా తనకు టికెట్ దక్కుతుందని ఆశించిన కృపారాణి టికెట్ దక్కకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే కృపారాణి తన సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, కాంగ్రెస్ లో చేరాక అయినా కృపారాణికి లక్ కలిసొస్తుందో లేదో చూడాలి. 

ALSO READ :- అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఏపీవాసులు మృతి