సైఫ్కోలో జేకే సిమెంట్​కు 60 శాతం వాటా

సైఫ్కోలో  జేకే సిమెంట్​కు 60 శాతం వాటా

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న సైఫ్కో సిమెంట్స్‌‌‌‌లో జేకే సిమెంట్ 60 శాతం వాటాను రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది.  జేకే ఆర్గనైజేషన్ గ్రూప్​కు చెందిన ఈ  సంస్థ శ్రీనగర్‌‌‌‌లో తయారీ కార్యకలాపాలను స్థాపించిన మొదటి ప్రధాన సిమెంట్ కంపెనీగా అవతరించింది. కంపెనీ,  దాని ప్రమోటర్ల మధ్య వాటాదారుల ఒప్పందం ప్రకారం, జేకే సిమెంట్ నిర్వహణ నియంత్రణ హక్కులను పొందుతుంది.  సైఫ్కో పెయిడప్ ​క్యాపిటల్​లో​60 శాతం వాటా కూడా ఉంటుంది. సైఫ్కో సిమెంట్స్  తమ  అనుబంధ సంస్థగా మారిందని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జేకే సిమెంట్ తెలిపింది.  సైఫ్కో బోర్డును తిరిగి ఏర్పాటు చేస్తారని, ఇందులో  ముగ్గురు ఉంటారని పేర్కొంది. 

సైఫ్కో బోర్డులో అదనపు డైరెక్టర్లుగా కంపెనీ నామినేట్ చేసిన వారిని నియమిస్తారు.  ఇద్దరు డైరెక్టర్లు సైఫ్కో  ప్రస్తుత ప్రమోటర్  ప్రమోటర్ గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తారు. 1997లో ఏర్పాటైన సైఫ్కో ఖోన్మోహ్​కు (శ్రీనగర్)లో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌‌‌‌ ఉంది.  0.26 ఎంఎన్​టీపీఏ క్లింకర్ సామర్థ్యం  0.42 ఎంఎన్​టీపీఏ గ్రైండింగ్ సామర్థ్యంతో ఓపీసీని తయారు చేస్తోంది. 2024–-25 సంవత్సరానికి దీని టర్నోవర్ రూ. 73.17 కోట్లని జేకే సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవ్‌‌‌‌పత్ సింఘానియా చెప్పారు.  జేకే సిమెంట్​కు 24.34 ఎంఎన్​టీపీఏ ఇన్‌‌‌‌స్టాల్డ్​ గ్రే సిమెంట్ సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వైట్ సిమెంట్ తయారీదారులలో ఒకటి. మొత్తం వైట్ సిమెంట్ సామర్థ్యం 1.12 ఎంఎన్​టీపీఏ కాగా,  వాల్ పుట్టీ సామర్థ్యం 1.33 ఎంఎన్​టీపీఏలు.