
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాభవన్ లో ఉర్దూ ఘర్ నిర్మించొద్దని కళాభవనం పరిరక్షణ జేఏసీ నాయకులు సింగిరెడ్డి పరమేశ్వర్, పాతూరి రమేశ్, బోరు కృష్ణయ్య, యాదగిరి అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లో ఏవో సువర్ణ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. మతపరమైన భవనాలు నిర్మిస్తే మత ఘర్షణలకు తావిచ్చినట్లవుతుందని వారు తెలిపారు.