Actress Seemantham: గ్రాండ్గా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్

Actress Seemantham: గ్రాండ్గా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ దంపతులు అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు 2025 జనవరిలోనే ప్రకటించారు. లేటెస్ట్గా రహస్య గోరఖ్ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 

అందులో జేబీ బంప్, కిరణ్ అబ్బవరంతో కలిసిన పిక్స్ ఉన్నాయి. ఇవి చూసిన నెటిజన్స్, పలువురు సెలబ్రిటీలు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, గతేడాది ఆగస్టులో కిరణ్ అబ్బవరం..రహస్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 2025 జనవరి 21న ప్రెగ్నెన్సీ ప్రకటించారు. 

Also Read : డైరెక్టర్ రాజ్తో సమంత ఫోటోలు

ఇక పెళ్లి తర్వాత రహస్య సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం స్థాపించిన క ప్రొడక్షన్స్ బాధ్యతలను నిర్వహిస్తుంది. కిరణ్ అబ్బవరం... గతేడాది `'క' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. 'రీసెంట్ గానే 'దిల్ రూబా'తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.. 

రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే కిరణ్ - రహస్యల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్య ప్రేమాయ‌ణం సాగించిన ఈ జంట 2024 ఆగస్ట్లో పెళ్లితో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు.