భారత్, చైనాలు గొడవలను మాని కలిసుండాలని చైనా అంబాసిడర్ సున్ వుయ్‌డాంగ్ అన్నారు. సరిహద్దు సమస్యలను శాంతిపూర్వకంగా చర్చలతో పరిష్కరించుకుందామని భారత్‌ను కోరారు. ఇరు దేశాలు ఒకరితో మరొకరు సామరస్యంగా కలసి ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘చాలా దేశాల మధ్య వైరుధ్యాలు ఉండటం మామూలే. సరిహద్దు సమస్యలను సరైన సమయంలో పరిష్కరించుకోవాలి. వాటికి దౌత్యపరమైన సంబంధాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. చర్చల ద్వారా బార్డర్ వివాదానికి పరిష్కారం లభిస్తుందని మేం నమ్ముతున్నాం. కానీ ఇదే సమయంలో మా దేశ సార్వభౌమత్వం, రక్షణ, అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం. చైనా, భారత్‌లు పరస్పరం ఒకర్నొకరు సమానంగా గౌరవించుకోవాలి’ అని సున్ వుయ్‌డాంగ్ పేర్కొన్నారు. భారత్‌కు చెందిన యువతతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
