Lok Sabha Election 2024: పోలింగ్ బూతులకు కొత్తగా పెళ్లయిన జంటలు క్యూ

Lok Sabha Election 2024: పోలింగ్ బూతులకు కొత్తగా పెళ్లయిన జంటలు క్యూ

దేశంలో ఓట్ల పండుగ షురూ అయింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 19) ఓట్ల పండగ రోజే పెళ్లిళ్లు ఉండటంతో..తాళి కట్టిన వెంటనే పెండ్లి మండపం నుంచే నేరుగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. 

పెళ్లి బట్టలు, మెడలో దండలు, కాళ్లకు పసుపు పారాణితో కొత్త జంటలు మేం కూడా ఓటు వేశామని వేలిని చూపుతూ పోలింగ్ బూత్ ల వద్ద సందడి చేశారు. వీరితో పాటు 80యేళ్లకు పైబడినవారు, కొత్త గా ఓటు వచ్చిన యువతీయువకులు, ట్రాన్స్ జెండర్లు ఓటు వేసి వేలికి సిరాతో ఫొటోలకు ఫోజులిచ్చారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  

దేశవ్యాప్తంగ ఏడు విడతల్లో జరిగే లోక్ సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. లోక్ సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతు న్నా యి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.