
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్మితే, కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఎరువుల షాపుల్లో లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ రిజిస్టర్, యూరియా, డీఏపీ, ఇతర పురుగుల మందులు ఫర్టిలైజర్స్ స్టాకులను సీడ్స్ డీలర్స్ పక్కాగా మెయింటైన్ చేయాలని కోరారు. మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం నిఘా, తనిఖీలు చేస్తాయన్నారు.
ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మాట్లాడుతూ జిల్లాలో కల్తీ ఎరువులు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 79950 74803, జిల్లా పోలీస్ హెడ్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ 87126 56922 లో సంప్రదించాలని సూచించారు. సమీక్షలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డీవో పీడీ మధుసూదన్‌రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, డీఏవో విజయనిర్మల, డీపీవో హరిప్రసాద్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.