
న్యూఢిల్లీ: కేరళకు చెందిన జ్యూయెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 2027–-28లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. 2024–-25లో రూ.62 వేల కోట్ల రెవెన్యూ సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి సాధించాలని టార్గెట్ పెట్టుకున్నామని కంపెనీ చైర్మన్ ఎం. పి అహ్మద్ పేర్కొన్నారు.
గోల్డ్ ధరలు భారీగా పెరిగినా ఈ గ్రోత్ సాధిస్తామని అన్నారు. బిజినెస్ విస్తరణలో భాగంగా ఈ ఏడాది ఇండియాలో 60 కొత్త స్టోర్స్, విదేశాల్లో 30 అవుట్‌లెట్స్ ఓపెన్ చేస్తామని వివరించారు.