ఎదవలు ఎక్కువయ్యారు : గంటకు ఎనిమిది మంది మహిళలపై అత్యాచారం

ఎదవలు ఎక్కువయ్యారు : గంటకు ఎనిమిది మంది మహిళలపై అత్యాచారం

బ్రెజిల్ లో 2022లో సగటున గంటకు ఎనిమిది కంటే ఎక్కువ అత్యాచారాలు నమోదయ్యాయని ఓ ఎన్జీవో నివేదికలో తెలిపింది. ఇది రికార్డు సంఖ్య అని, సాధారణం కంటే ఇది 60 శాతం కంటే ఎక్కువ అని చెప్పింది. మరో దిగ్ర్భాంతికర విషయమేమిటంటే ఇందులో చాలా మంది బాధితులు 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలవారేనని స్పష్టం చేసింది.

గతేడాది 200 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో 74వేల 930 అత్యాచారాలు నమోదయ్యాయని బ్రెజిలియన్ ఫోరమ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ (FBSP) తెలిపింది. అయితే 2021 నుంచి ఇది 8.2 శాతం పెరుగుదలగా తెలుస్తోంది. పోలీసు రిజిస్టర్లు, ఇతర అధికారిక పత్రాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం, బాధితుల్లో 10 శాతం కంటే ఎక్కువ మంది నాలుగు కంటే తక్కువ వయస్సు గలవారే కావడం గమనార్హం.

ఇక మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీటిల్లో దాదాపు 70 శాతం అత్యాచారాలు బాధితుల ఇళ్లలోనే జరిగినట్టు తెలుస్తోంది. “కరోనా మహమ్మారి సమయంలో పాఠశాలలు చాలా కాలం పాటు మూసివేశారు. ఈ సమయంలో వారు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత పాఠశాలలు తెరవడంతో, ఫిర్యాదుల సంఖ్య మళ్లీ పెరిగింది”అని FBSP కోఆర్డినేటర్ జూలియానా మార్టిన్స్ అన్నారు. అయితే 2022లో 1 వెయ్యి 437 స్త్రీల హత్యలు నమోదయ్యాయని, 2021 నుండి ఇది 6.1 శాతం పెరిగిందని, 2 లక్షల 45 వేల 713 భార్యాభర్తల హింస కేసులు నమోదు కాగా.. ఇది ఇంతకుమునుపు కంటే 2.9 శాతం ఎక్కువని NGO తెలిపింది.