రేపటి నుంచి తెరుచుకోనున్న మొఘల్ గార్డెన్స్

రేపటి నుంచి తెరుచుకోనున్న మొఘల్ గార్డెన్స్

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మొఘల్‌ గార్డెన్‌ను పర్యాటకులు సందర్శనార్థం రేపు(శనివారం) నుండి తెరవనున్నారు. మార్చి 16 వరకు పర్యాటకులను కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి గురువారం రాష్ట్రపతి భవనం ప్రకటన విడుదల చేసింది. ముందస్తుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే అనుమతి ఉందని తెలిపింది. బుకింగ్‌ కోసం  https://rashtrapatisachivalaya.gov.in , https://rb.nic.in/rbvisit/visit_plan.aspx గతేడాది మాదిరిగానే... ఈ ఏడాది కూడా ముందస్తు చర్యల్లో భాగంగా.. ఆన్‌లైన్‌ టికెట్‌ లేకుండా అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. రాష్ట్రపతి భవన్‌లో వార్షిక 'ఉద్యానోత్సవ్‌' రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ప్రారంభించారు. సాధారణ ప్రజల సందర్శనార్ధం ఫిబ్రవరి12 నుండి మార్చి 16 వరకు మెఘల్‌ గార్డెన్స్‌ను తెరవనున్నారని ప్రకటన తెలిపింది. సోమవారాలు మినహా మిగిలిన రోజులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరుస్తారని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం...

కరోనా లేకుంటే మా పెళ్లి అయిపోయేది