
ముంబై: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ గా రణ్బీర్ కపూర్, అలియా భట్ కు పేరుంది. ఈ జంట త్వరగా ఒక్కటవ్వాలని వారిద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే పెళ్లి వార్తలపై మాత్రం రణ్బీర్, అలియా బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా అలియా ఫస్ట్ టైమ్ రణ్బీర్ తో వివాహంపై స్పందించింది. తాను ఇప్పటికే అతడితో పెళ్లి అయిపోయిందనే భావనలో ఉన్నానని ఆర్ఆర్ఆర్ హీరోయిన్ పేర్కొంది. మైండ్ లో రణ్బీర్ తన భర్త అని ఫిక్స్ అయ్యానని చెప్పింది. మరోవైపు గతంలో ఓ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ.. కరోనా రాకపోయినట్లయితే తామిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్లమని తెలిపాడు. ఈ విషయాన్ని అలియా కూడా అంగీకరించింది. కరోనా మహమ్మారి తమ పెళ్లి పనులను పాడు చేసిందని చెప్పింది.
In a recent interaction with NDTV, @aliaa08 spoke about marriage with #RanbirKapoor.
— HT City (@htcity) February 11, 2022
"I'm already married to Ranbir Kapoor in my head... I feel like the timing of even when we get married, it's all going to work out in all the right and beautiful way," said #AliaBhatt. pic.twitter.com/LeCVL3BfEp
మరిన్ని వార్తల కోసం: