వనపర్తి జిల్లాను నేనే డెవలప్ చేసిన: నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాను నేనే డెవలప్ చేసిన:  నిరంజన్ రెడ్డి

పెబ్బేరు, వెలుగు: జిల్లాకు కావాల్సిన అన్ని సౌలతులు కల్పించి, డెవలప్ చేశానని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. చౌడేశ్వరీ దేవి జాతర సందర్భంగా పెబ్బేరు పీజీపీ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్, పిషరీస్, ఇం జినీరింగ్, ఫార్మసీ కాలేజీలను తెప్పించానని చెప్పారు.

వీటితో పాటు వందలాది సమస్యల కు పరిష్కారం చూపానన్నారు. ఈ విషయాన్ని కొందరు అపార్థం చేసుకొని ఏదేదో చేస్తుం టారని, అవన్నీ పట్టించుకోనని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు పార్వతి, సుమతి, అక్క మ్మ, పద్మ, చిన్న ఎల్లారెడ్డి, బుచ్చారెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, జగన్నాథం నాయుడు, సాయి పాల్గొన్నారు.