కెమికల్ ప్లాంట్పై రష్యా దాడి.. అమ్మోనియా గ్యాస్ లీక్

 కెమికల్ ప్లాంట్పై రష్యా దాడి.. అమ్మోనియా గ్యాస్ లీక్

ఉక్రెయిన్ పై గత 26 రోజులుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా తాజాగా ఓ కెమికల్ ప్లాంట్ పై దాడి చేయడం కలకలం రేపింది. తూర్పు ఉక్రేనియన్ నగరమైన సుమీ శివార్లలోని ఓ కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అవుతున్నట్లు సోమవారం తెల్లవారుజాము గుర్తించారు. ఉక్రెయిన్ పై పట్టు సాధించేందుుకు రష్యా దళాలు బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి.
రష్యా దళాల దాడుల వల్లే సుమీ  నగర శివార్లలోని రసాయన కర్మాగారం నుండి గ్యాస్ లీక్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సుమీ ప్రాంతీయ గవర్నర్ డిమిట్రో జైవిట్‌స్కీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో గ్యాస్ లీక్ గురించి ప్రకటించారు. గ్యాస్ లీక్ ప్రభావం దాదాపు 2.5 కిమీ (1.5 మైళ్ళు) విస్తీర్ణం వరకు కనిపించిందని పేర్కొన్నారు. గ్యాస్ లీక్ వల్ల ప్రస్తుతానికి  సుమీ నగరానికి  ప్రత్యక్ష ముప్పు లేదని ఆయన తెలిపారు. అయితే గాలి వీస్తున్న దిశలో ఉన్న నోవోసెలీట్యా పట్టణాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె