వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి... కిటికీ అద్దాలు ధ్వంసం

వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి... కిటికీ అద్దాలు ధ్వంసం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ రైలును ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ రైల్వే స్పష్టం చేసింది. రాళ్ల దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రైలు భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ 6 న విశాఖపట్నం నుంచి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. గత మూడు నెలల్లోనే ఇలా రైలుపైకి రాళ్లు రువ్వడం ఇది మూడోసారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగంతకులు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి, ఈ రైలు తిరునవయ-తిరూర్ మధ్య ప్రయాణిస్తుండగా.. కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది మే 1న సాయంత్రం 5గంటల ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించామని, దుండగుల జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.