- రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి ప్రతిపాదన
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి శుక్రవారం ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 21ఏ ప్రకారం .. 6 నుంచి 14 ఏండ్ల పిల్లలకు మాత్రమే ఉచిత & నిర్బంధ విద్య ఫండమెంటల్ రైట్ గా ఉందని..దాన్ని 3 ఏండ్ల నుంచే మొదలు పెట్టాలని కోరారు. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన అంగన్‌వాడీ / ప్రీ-స్కూల్ విద్య, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణను తప్పనిసరి చేయాలన్నారు. ఇందుకోసం కొత్త ఆర్టికల్ 21బీని చేర్చాలని సుధా మూర్తి సూచించారు.
3–6 ఏండ్ల మధ్య పిల్లలకు మంచి పునాది వేయకపోతే వారికి జీవితాంతం నష్టం కలుగుతుందని ఎమోషనల్‌గా మాట్లాడారు.పేద కుటుంబాల్లో చాలా మంది తల్లిదండ్రులకు అంగన్‌వాడీ విద్య ప్రాముఖ్యత కూడా తెలియదన్నారు. అందుకే అంగన్‌వాడీలను బలోపేతం చేసి, లేదా వేరే ఏ మార్గమైనా ఎంచుకుని, ప్రతి పిల్లవాడికీ నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య అందేలా చూడాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్లకు మెరుగైన శిక్షణ కూడా ఇప్పించాలన్నారు.

