భానుడు  మాడు పగలకొడుతున్నాడు.... మరో ఐదు రోజులు ఇంతే... 

భానుడు  మాడు పగలకొడుతున్నాడు.... మరో ఐదు రోజులు ఇంతే... 

భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రయాణికులు వడగాల్పులకు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఎండలు తారెత్తిస్తున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతలు, అధిక వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఎండలు కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో  గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల దాటికి జనం నీరసిస్తుండగా రాత్రిళ్ళు ఉక్క పోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో పగలు బయటకు తిరగలేక, రాత్రిపూట ఇళ్లల్లో నిద్రపోలేక జనం అల్లాడిపోతున్నారు. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల కోసం జనం పరుగులు తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.  ఎండ వేడికి బయటకు వస్తే మాడు పగిపోయేటంతగా హీట్ పుట్టిస్తోంది.  ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారు. మరో రెండు రోజులు వడగాలులుల వీచే అవకాశం ఉందని .. ఇంకా ఐదు రోజుల పాటు నిప్పుల కొలిమి ఉంటుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరిస్తున్నారు.  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.  పలు జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.