టిక్ టాక్ రెసిపీ.. ముఖం ఇలా అయిపోయింది

టిక్ టాక్ రెసిపీ.. ముఖం ఇలా అయిపోయింది

సోషల్ మీడియాలో ప్రమోషన్స్ పేరుతో చాలా మంది వివిధ రకాల బ్యూటీ టిప్స్ యూజ్ చేసి, వీడియో షేర్ చేస్తుంటారు. మరికొందరు వివిధ హ్యాక్స్, రెసీపీలు చేసి మిలియన్లలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉంటారు. అలా ఓ 37ఏళ్ల యువతి ఓ భిన్న రెసిపీని ప్రయత్నించి, చేదు అనుభవాన్ని మిగిల్చుకుంది.

టిక్ టాక్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో షఫియా బషీర్ అనే యువతి.. గుడ్లతో ఓ వెరైటీ వంటకం చేసింది. షెల్స్ తో పాటు మైక్రోవేవ్ లో వేడి నీటిలో గుడ్లను ఉడికించిన ఆమె.. ఆ తర్వాత తాను చూసిన వైరల్ వీడియోలో సూచించిన విధానాలను ఫాలో అయింది. అలా కొన్ని నిమిషాలు ఆమె గుడ్లను ఉడికించింది. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి దానిపై ఓ చల్లని చెంచాను ఉంచడంతో అది విస్పోటనం చెందింది. అది చిల్లి ఆమె ముఖం కుడివైపు పడడంతో అంతా కమిలిపోయినట్టయింది. ఆ తర్వాత ఆమె తీవ్ర నొప్పితో బాధపడింది.

తనకు ఎదురైన ఈ బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ మహిళ.. ఇది తనకు భయంకరమైన సమయమని, తనకు చాలా నొప్పిగా ఉందంటూ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ముఖంపై పడిన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమెకు 12గంటల సమయం పట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆమె ముఖంపై ఎలాంటి మచ్చలు పడలేదు. ఇప్పుడు తనకు నయమైంజని. ఎలాంటి మచ్చలు కూడా లేవని, వాసెలిన్, సుడోక్రెమ్.. లాంటివి వాడానని ఆ మహిళ తర్వాత చెప్పుకొచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.