పర్యాటకుల తాకిడి: కనువిందు చేస్తున్న క్షీర జలపాతం

పర్యాటకుల తాకిడి:   కనువిందు చేస్తున్న క్షీర  జలపాతం

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మందమర్రి మండలంలోని అందుగుల పేట గ్రామ శివారులో ఉన్న ‘క్షీర’ జలపాతం జాలువారుతోంది. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండలపై నుంచి నీరు కిందికి దుంకుతుండడంతో జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.