వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా

తనపై దాడి పిరికి పందల చర్య అన్నారు ఎంపీ అర్వింద్. పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్ముర్ నుంచి పోటీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50 వేల మెజారిటీతో ఒడిస్తామన్నారు. 
జీవన్ రెడ్డి ని ఓడించక పోతే నా పేరు ధర్మపురి అరవింద్ కాదంటూ సవాల్ చేశారు అర్వింద్. టిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొంటా
అన్నారు. ఈ దాడిలో పోలీస్ కమిషనర్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. మొబైల్ ఫోన్లతో తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు.  కేంద్ర హోంమంత్రికి దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు. తనపై దాడి వెనుక సర్కారు కుట్ర ఉందన్నారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారన్నారు. ఈ దాడి వెనుక సీపీ పాత్ర కూడా ఉందన్నారు అర్వింద్. ఎంపీపై, కార్యకర్తలపై హత్యాయత్నం చేశారన్నారు. పోలీసులను గుండాలుగా తయారు చేస్తున్నారన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. బీజేపీ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు సీపీ కార్యాలయానికి వచ్చారు ఎంపీ అర్వింద్. 

పోలీసులు దగ్గరుండి టీఆర్ఎస్ కార్యకర్తలతో దాడి చేయించారన్నారు. రాళ్లు, కత్తులతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడిలో తన వాహనం ధ్వంసం అయ్యిందన్నారు. చాలా మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్ స్పందించడం లేదని విమర్శించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చినా ఒక్క అధికారి సిపి కార్యాలయంలో లేరన్నారు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని ఆరోపించారు. 

మరోవైపు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనలో దెబ్బతిన్న వాహనాలతో సిపి కార్యాలయానికి  బీజేపీ కార్యకర్తలు..భారీగా చేరుకున్నారు. ఎంపీ వాహనంతో పాటు కాన్వాయ్ లో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు బిజెపి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సిపి కార్యాలయంలో గంట సేపుగా సిపి కోసం ఎంపీ ఎదురు చూపులు చూశారు. బిజెపి కార్యకర్తలపై కత్తితో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దాడికి దిగినట్లు ఆరోపిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి: 

హరీశ్ రావు కాన్వాయ్ అడ్డుకున్నబీజేపీ నేతలు

తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది