కొందరు భర్తలను చంపుతుంటే.. ఇలాంటి అమాయకులేమో భర్తల చేతిలో బలైపోతున్నారు.. పాపం పెళ్లైన ఐదు నెలలకే..

కొందరు భర్తలను చంపుతుంటే.. ఇలాంటి అమాయకులేమో భర్తల చేతిలో బలైపోతున్నారు.. పాపం పెళ్లైన ఐదు నెలలకే..

అతడొక మర్చంట్ నేవీ ఆఫీసర్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మంచి జీతం.. సమాజంలో హోదా. అయినప్పటికీ కట్నం కోసం కక్కుర్తి పడి మూడుముళ్ల బంధంతో తనలో సగమైన భార్యను కడతేర్చాడు. తన భార్యను చంపేసి సూసైడ్ చేసుకుందని పోలీసులకు ఫోన్ చేశాడు ఈ ఘనుడు. వేరే మహిళతో ఎఫైర్ నడుపుతూ.. పెళ్లాన్ని వదిలించుకునేందుకు క్రైమ్ సినిమాల్లో మాదిరిగా స్కెచ్ లు వేసి.. పెళ్లైన ఐదు నెలలకే భార్యను చంపేసిన ఈ దుర్మార్గుడి కథలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో ప్లాన్ లు.. ఎంతో క్రైమ్ కహానీ దాగి ఉంది. పోలీసులకే షాకిచ్చిన ఈ హంతకుడి గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది ఈ దారుణ ఘటన. మధు అనే 32 ఏళ్ల యువతి ఐదు నెలల క్రితం ఫిబ్రవరి 25న అనురాగ్ అనే నేవీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. హాంగ్ కాంగ్ కు చెందిన షిప్ మేనేజ్మెంట్ సంస్థలో అనురాగ్ పనిచేస్తున్నాడు. ఉన్నట్లుండి లక్నో ఇంట్లో తన భార్య శవంలా పడి ఉందని పోలీసులకు ఫోన్ చేశాడు భర్త అనురాగ్. మరోవైపు తన కూతురిని అనురాగ్ హత్య చేస్తున్నాడని మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులున్న ఈ కేసును పోలీసులు ఛేదించించారు. 

మధు-అనురాగ్ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కనెక్టయ్యారు. ఆ తర్వాత పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో 15 లక్షల రూపాయల కట్నం డిమాండ్ చేసినట్లు మధు కుటుంబసభ్యులు ఆరోపించారు. పెళ్లై ఒక నెల గడిచిన వెంటనే కట్నం ఇవ్వాల్సిందిగా తన కూతురికి టార్చర్ మొదలుపెట్టినట్లు మధు తండ్రి పోలీసులకు తెలిపాడు. పెళ్లైన మరుసటి నెలలో హోలీ పండుగ సందర్భంగా కట్నం గురించి కొట్టడంతో తన కూతురు తమ ఇంటికి వచ్చినట్లు చెప్పాడు. దీంతో అదనపు కట్నం ఇచ్చి కూతురుని భర్త దగ్గరికి పంపించాడు తండ్రి. 

వేరే మహిళతో ఎఫైర్.. మా అక్క సోషల్ లైల్ నాశనం చేశాడు:

పెళ్లైన తర్వాత అనురాగ్ తమ అక్క సోషల్ లైఫ్ నాశనం చేశాడని మధు చెల్లి ప్రియ పేర్కొంది. తమ అక్క ఎవరితో  మాట్లాడినా సహించే వాడు కాదని తెలిపింది. చివరికి తమతో మాట్లాడాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేదని తెలిపింది. అనురాగ్ డ్యూటీకి  వెళ్లిన టైంలో మాత్రమే మాతో ఫోన్ మాట్లాడేదని పోలీసులకు వివరించింది. అతను తాగుతున్నప్పుడు తనతో పాటు తాగాల్సిందిగా ఫోర్స్ చేసేవాడని.. తాగలేదని కొట్టేవాడని పోలీసులు చెప్పింది ప్రియ.

మధు పెళ్లైన తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సంబంధాలన్నీ తెగిపోయాయని.. కేవలం అతడు లేని సమయంలో మాత్రమే తమతో ఫోన్ మాట్లాడేదని చెప్పింది. ఎప్పటికప్పుడు ఫోన్, మెసేజ్, వాట్సాప్ చెక్ చేసేవాడని.. ఘోరమైన అనుమానంతో టార్చర్ చేసేవాడని చెప్పింది. 

వేరే మహిళతో ఎఫైర్.. భార్య అబార్షన్ కు ఒత్తిడి:

అనురాగ్ వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకుని తన కూతురిని టార్చర్ చేసేవాడని మధు తండ్రి చెప్పారు. తన కూతురు గర్భవతి అయితే.. అబార్షన్ చేసుకోవాలని ఒత్తడి చేశాడని తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ రూమ్ లో గడిపిన వీడియో ఫూటేజ్ పోలీసులకు చూపించారు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో చేసే చాటింగ్ చూసి మధు తమకు అన్ని విషయాలు చెప్పేదని తెలిపారు. మధు నాలుగు రోజులకు చనిపోతుందనే ముందు.. జులై 31 హోటల్ బుకింగ్ కు సంబంధించిన వివరాలు పోలీసులకు ఇచ్చారు. అయితే ఆగస్టు 3 (ఆదివారం) మధు చనిపోగా.. ఆగస్టు 4 మధ్యాహ్నం తన భార్య సూసైడ్ చేసుకుందని పోలీస్ హెల్ప్ లైన్ 112 కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు పేరెంట్స్ ఫోన్ చేసినట్లు తెలిపారు. 

ఎలా దొరికిపోయాడు:

తన భార్య చనిపోయినట్లు పోలీసులకు ఫోన్ చేయడంతో అనురాగ్ హత్య చేశాడా లేదా అనే కోణంలో విచారణ మొదలు పెట్టారు పోలీసులు. మధు పేరెంట్స్ ఇచ్చి కంప్లైంట్ తో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే మధును చంపిన రోజు పనిమనిషిని రావద్దని అనురాగ్ మెసేజ్ చేశాడు. అయితే మెసేజ్ చూసుకోకుండా పనిమనిషి ఇంటికి వచ్చింది. డోర్ కొట్టినా ఓపెన్ చేయలేదని ఆమె పోలీసులకు తెలిపింది. అదే రోజు ఆన్ లైన్ లో 10.30 కి ఫుడ్ ఆర్డర్ చేశాడు అనురాగ్. 

ఎట్టకేలకు అనురాగ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. మధు మృతికి కారణం ఏంటని ప్రశ్నించారు. తనకు తాను సూసైడ్ చేసుకుందని అనురాగ్ చెప్పాడు. ఒకవేళ ఆమె సూసైడ్ చేసుకుంటే.. ఆమెను అంతవరకు తీసుకెళ్లిన పరిస్థితులేంటని ప్రశ్నించడంతో నోరెళ్లబెట్టాడు. ఎవిడెన్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వరకట్న నిషేధిత చట్టం కింద అరెస్టు చేశారు.