ఏలియన్స్ ఉనికి లేదు : వైట్ హౌస్

ఏలియన్స్ ఉనికి లేదు : వైట్ హౌస్

అమెరికా గగనతలంపై మరో గుర్తుతెలియని వాహనం చక్కర్లు కొట్టింది. ఈ అనుమానిత వాహనాలు ఏలియన్స్కు చెందినవని.. అగ్రరాజ్యంలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని వైట్ హౌస్ కొట్టిపారేసింది. గ్రహాంతర జీవులకు సంబంధించి ఎటువంటి కదలికలు లేవని వైట్ హౌస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ చెప్పారు. కొన్ని వ‌స్తువుల్ని పేల్చివేసిన ఘటనలో కొన్ని అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయ‌ని, ఆ పేల్చివేత‌ల‌కు ఏలియన్స్‌ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న చైనా స్పై బెలూన్​ కూల్చివేత తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. దీంతో అమెరికన్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో  అవి ఏలియన్స్ కు చెందిన వస్తువులు కావని వైట్ హౌస్ ప్రకటించింది.