హెలికాప్టర్​ లో చెలరేగిన మంట.. గాల్లో ముక్కలై కాలిపోయింది

హెలికాప్టర్​ లో చెలరేగిన మంట.. గాల్లో ముక్కలై కాలిపోయింది

అడవిలో చెలరేగిన మంటలు ఆర్పేందుకు వెళ్లిన హెలికాప్టర్​ గాల్లోనే కాలి కింద పడి ముక్కలై బూడిద అయిన ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రివర్​సైడ్​కౌంటీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 

అవి అంతకంతకూ వ్యాపిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్‌ సహకారంతో పని చేస్తున్న ఓ హెలికాప్టర్  ఆగస్టు 6న​ మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగింది. 

మంటలు ఆర్పుతున్న క్రమంలో అకస్మాత్తుగా హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. దీంతో అది గాల్లోనే ముక్కలై శిథిలాలు అడవిలో చెలరేగిన మంటల్లో పడిపోయాయి. మంటల సెగ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తుండగా.. దీని వెనక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

20 ఎకరాల్లో అడవి కాలి బూడిద అయిందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని స్థానికులు చెబుతున్నప్పటికీ అధికారులు కన్ఫామ్​ చేయలేదు.