గోరక్షకులపై కేసులను ఎత్తివేయాలి

 గోరక్షకులపై కేసులను ఎత్తివేయాలి

సూర్యాపేట, వెలుగు : గోరక్షకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని భజరంగ్​దళ్​రాష్ట్ర సహసంయోజక్ కన్నెబోయిన వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోరక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా విశ్వహిందూ పరిషత్ ‘ఆపరేషన్ గోమాత’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గురువారం సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి భక్తాంజనేయస్వామి ఆలయం వరకు గోవులతో కలిసి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు.

 ఈ సందర్భంగా  విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ హిందువులు దేవతగా భావించే గోమాతను అక్రమ రవాణా చేస్తూ మాంసంగా అమ్మడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గోరక్షణ చట్టాన్ని అమలు చేయాలని, గో అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​చేశారు. భజరంగ్​దళ్ జిల్లా సంయోజక్ పసునూరి దినేశ్​బాబు, నాయకులు పాల్గొన్నారు.