ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ హతం

ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ హతం

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ క్రిమినల్‌ హతమయ్యాడు. నేరస్థుడిని గుఫ్రాన్‌గా గుర్తించారు. గుఫ్రాన్ అనేక హత్య, దోపిడీ కేసులలో వాంటెడ్ గా ఉన్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్, ఇతర జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీతో సహా 13కి పైగా కేసుల్లో గుఫ్రాన్ క్రిమినల్ గా ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు యూపీ పోలీసులు ఇంతకు మునుపే రూ.1 లక్ష నగదు బహుమతిని కూడా ప్రకటించారు.

ఎలా జరిగిందంటే..

ఈ ఉదయం 5:00 గంటలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం కౌశాంబి జిల్లాలో దాడులు చేసిందని యూపీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్‌ను వారు ఎదుర్కొన్నారని, కాల్పులు కూడా జరిపారన్నారు. క్రాస్ ఫైరింగ్‌లో గుఫ్రాన్ గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ALSO READ:స్టూడెంట్ల ఆత్మహత్యలపై ​వీసీలు, రిజిస్ట్రార్లు ఆలోచించాలి : తమిళి సై

యూపీ పోలీసులకు, నేరగాళ్లకు మధ్య జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో ఇది తాజాది. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10వేల 900 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అందులో 185 మందికి పైగా నేరస్థులు మరణించారు.