
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం జింద్ జిల్లా రామ్ రాయ్ గ్రామంలో ఆయిల్ ట్యాంకర్, ఆటోను ఢీకొట్టడంతో 10 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆటోలో యువకులు ఆర్మీ రిక్రూట్ మెంట్ కు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బురదహర్ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.