నిజంగా షాకింగ్: పదేళ్ల పాప ఆత్మహత్య.. ఇలాంటి ఆలోచనలు ఎలా..

నిజంగా షాకింగ్: పదేళ్ల పాప ఆత్మహత్య.. ఇలాంటి ఆలోచనలు ఎలా..

మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసయ్యాడని.. తల్లి నిత్యం తిడుతోందని ఓ పదేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబడి గ్రామానికి చెందిన సవిత(10) అనే బాలిక ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సదరు బాలిక స్థానికంగా ఆరో తరగతి చదువుతోంది. 

ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటి పైకప్పుకు చిన్నారి వేలాడుతుండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ సమయంలో తల్లి మేకలు కాయడానికి వెళ్లగా, తండ్రి బయటకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. తండ్రి తాగుడుకు బానిస అవ్వడం.. తల్లి నిరంతరం తిట్టడం వంటి చర్యలు బాలికను కఠిన నిర్ణయం వైపు నడిపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఏదేమైనా 10 ఏళ్ల వయసులో బాలిక ఆత్మహత్య చేసుకోవడమన్నది ఊహించని ఘటనే. అభం శుభం తెలియని ఆ చిన్నారి.. అంతటి కఠిన నిర్ణయం వైపు అడుగులు వేసిందంటే ఎంతటి మానసిక క్షోభ అనుభవించిందో ఊహించగలరు.