రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం

రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం

గుజరాత్​నుంచి రెండోసారి జైశంకర్‌‌‌‌

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌, టీఎంసీ నేత డెరెక్‌‌‌‌ ఓబ్రెయిన్‌‌‌‌ సహా 11 మంది నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌లో 6, గుజరాత్‌‌‌‌లో 3, గోవాలో ఒక స్థానానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఓటింగ్ జరగాల్సి ఉంది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అయితే, ఈ స్థానాల్లో ఒక్కో నామినేషన్​మాత్రమే దాఖలు కావడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది. మొత్తంగా ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు, ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని ఒక రాజ్యసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ తృణమూల్ విజయం సాధించింది. గుజరాత్​నుంచి బీజేపీ అభ్యర్థులు జైశంకర్, బాబూభాయ్ దేశాయ్, కేసరిదేవ్ సింగ్ ఝాలా ఎన్నికయ్యారు. బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్, గోవా నుంచి సదానంద్ షెట్ తనవాడే ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైనవారిలో డెరెక్ ఓబ్రెయిన్‌‌‌‌తో పాటు సుఖేందు శేఖర్ రాయ్, డోలా సేన్, సాకేత్ గోఖలే, సమీరుల్ ఇస్లాం, ప్రకాశ్​ బారిక్‌‌‌‌ ఉన్నారు. ఈ ఎన్నికతో రాజ్యసభలో బీజేపీ, మిత్రపక్షాల మొత్తం సీట్లు 105కి పెరిగాయి. కాంగ్రెస్​ బలం 30 మంది సభ్యులకు పడిపోయింది. బీజేపీ సభ్యుల సంఖ్య 94 కు చేరనున్నది.

ALSO READ:థర్మల్ ప్రాజెక్టుల పనుల్లో.. 15 వేల కోట్ల దోపిడీ : రేవంత్​రెడ్డి