ఇలాంటి ఒక ప్రశ్న వేస్తే ఏమంటారు? ఇదొక ప్రశ్నా అని అడుగుతారు కదా! సరిగ్గా నీళ్లు తాగకపోవడం వల్లనే సగానికి సగం రోగాలు మనల్ని వెంటబెట్టుకునే తిరుగుతున్నాయి. అలాగే సరిగ్గా నీళ్లు తాగని వాళ్లే సగానికి సగం మంది ఉన్నారు. నీళ్లు సరిగ్గా తాగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. రోజుకి కనీసం మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగితే మన శరీర భాగాలన్నీ చక్కగా పనిచేస్తుంటాయి. ఇంత తెలిసినా నీళ్లు తాగడానికి కూడా బద్ధకిస్తుంటారు. చాలామంది. నీళ్లు బాగా తాగితే చర్మానికి కూడా మంచిది.
నీళ్లు తాగితే...
చర్మం మీద ముడతలు తగ్గుతాయి.
జుట్టుకి నేచురల్ లోషన్ లా పనిచేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. నెత్తిమీద పేరుకునే మట్టి పోవాలన్నా నీళ్లు బాగా తాగాల్సిందే.
మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతాయి.
శరీరం లోపలి మలినాలు వాటంతట అవి బయటికి వెళ్లిపోతాయి.
గోళ్లు బాగా పెరుగుతాయి.
ఎండకు దెబ్బతిన్న చర్మం బాగవుతుంది.
చర్మం కాంతివంతంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా అది కనిపించదు.
చర్మంలో పీహెచ్ లెవెల్ను నీళ్లు బ్యాలెన్స్డ్ డ్గా ఉంచుతాయి. దానివల్ల చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
నీళ్లు తాగకపోతే...
ముఖం ఉబ్బుతుంది.
చిన్న వయసే ఉన్నా పెద్దవాళ్లలా కనిపిస్తారు.
చర్మం పొడిబారి, దురద పెడుతుంది.
