అటు కరోనా.. ఇటు రెసిషన్.. పేదరికంలోకి 15 కోట్ల మంది

అటు కరోనా.. ఇటు రెసిషన్.. పేదరికంలోకి 15 కోట్ల మంది

కరోనాతోపాటు చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభాల వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పేదరికంలోకి కూరుకుపోతారని వరల్డ్​ బ్యాంక్​ తాజా రిపోర్ట్​ పేర్కొంది. ఈ ఏడాది ఈ సంఖ్య 8.8 కోట్ల నుంచి 11.5 కోట్ల వరకూ ఉంటే, వచ్చే ఏడాది అది 15 కోట్లకు చేరుతుందని చెప్పింది. వరల్డ్​ బ్యాంక్​ బుధవారం రిలీజ్​ చేసిన బైనియల్​ పావర్టీ, షేర్డ్​ ప్రాస్పరిటీ రిపోర్ట్​లో అనేక షాకింగ్​ విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా ఎఫెక్ట్.. చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభాల వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోతారట. ఈ ఏడాది ఈ సంఖ్య 8.8 కోట్ల నుంచి 11.5 కోట్ల వరకూ ఉంటే వచ్చే ఏడాది అది 15 కోట్లకు పెరుగుతుందట. ప్రపంచ జనాభాలో 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారని వరల్డ్​ బ్యాంక్​ తాజా రిపోర్ట్​ పేర్కొంది. వరల్డ్​ బ్యాంక్​ విడుదల చేసిన బైనియల్​ పావర్టీ, షేర్డ్​ ప్రాస్పరిటీ రిపోర్ట్​లో షాకింగ్​ విషయాలు వెల్లడయ్యాయి.

మిడిల్​ ఇన్​కం కంట్రీలపైనే ఎఫెక్ట్

కరోనా తర్వాత ఎకానమీలో చాలా మార్పులు వస్తాయని వరల్డ్​ బ్యాంక్​ చెప్పింది. భారీ మార్పులకు దేశాలన్నీ సిద్ధం కావాలని సూచించింది. తీవ్రమైన పేదరికంలోకి ఎంత మంది వెళతారనేది ఆర్థిక సంక్షోభ తీవ్రతపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే పేదరికం ఎక్కువ స్థాయిలో ఉన్న కంట్రీలపై దీని ఎఫెక్ట్​ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయే మొత్తం జనాభాలో 82 శాతం మంది మిడిల్​ ఇన్​కం కంట్రీల్లోని వారేనని వరల్డ్​ బ్యాంకు అంచనా వేసింది.

ధారావి సక్సెస్​ సోర్టీ

ఈ రిపోర్ట్​లో ముంబైలోని ధారావి స్లమ్​ సక్సెస్​ స్టోరీ గురించి కూడా వరల్డ్​ బ్యాంక్​ ప్రస్తావించింది. ఇండియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారావిలో కరోనా మహమ్మారిని కంట్రోల్​ చేసేందుకు తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయని పేర్కొంది. కమ్యూనిటీ మెంబర్లను మొబిలైజ్​ చేయడం, ప్రైవేట్​ మెడికల్​ క్లినిక్​ల స్టాఫ్​​ను పక్కా ప్లానింగ్​ ప్రకారం వాడి ఫీవర్, ఆక్సిజన్​ లెవల్స్​కు సంబంధించి మాస్​ స్క్రీనింగ్​ చేయడం చాలా ఎఫెక్ట్ చూపించిందని తెలిపింది. ధారావిలో మేలో పీక్​ స్టేజ్​లో ఉన్న కరోనా కేసుల సంఖ్య జులై నాటికి అంటే మూడు నెలల కాలంలో 20 శాతం తగ్గాయని పేర్కొంది.

డిఫరెంట్​ ఎకానమీ..

ఇప్పటి వరకూ గ్లోబల్​గా 3.5 కోట్ల మంది కరోనా బారిన పడ్డగా.. పది లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావంతో అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. చాలా దేశాల్లో పూటగడవని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు పోయి, ఉపాధి లేక లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోయారు. పోస్ట్​ కరోనా తర్వాత డిఫరెంట్​ ఎకానమీకి దేశాలన్నీ సిద్ధం కావాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. కొత్త బిజినెస్​లు, సెక్టార్లకు ఫోకస్​ మారకపోతే మనుగడ కష్టమని పేర్కొంది. రిసోర్సెస్, క్యాపిటల్, లేబర్, ఇన్నోవేషన్​ మొదలైనవి ఒక సెక్టార్​ నుంచి మరో సెక్టార్​కు మారాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపింది.

పేదరికం ఇప్పట్లో పోదు

2017లో 9.2 శాతంగా ఉన్న పేదరికం రేటు క్రమంగా తగ్గుతుందని గతంలో వరల్డ్​ బ్యాంక్​ అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేయకపోతే 2020 నాటికి పేదరికం రేటు 7.9 శాతంకి దిగివస్తుందని భావించింది. కానీ కరోనా ఎఫెక్ట్​ తో ఈ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఇక కరోనా, రెసిషన్​ కారణంగా ప్రపంచ జనాభాలో 1.4 శాతం మంది తీవ్రమైన పేదరికంలోకి వెళ్లిపోతారని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్​ డేవిడ్​ మాల్​పస్​ చెప్పారు. 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలన్నా లక్ష్యం కరోనా మహమ్మారి కారణంగా మారింత ఆలస్యమయ్యే పరిస్థితులు వచ్చాయని, అప్పటికీ దానిని పూర్తి చేయాలంటే కీలకమైన, వేగవంతమైన, ఎఫెక్టివ్​ చర్యలను తీసుకున్నట్లయితే సాధ్యపడుతుందని స్పష్టం చేసింది. 2030 నాటికి గ్లోబల్​ పావర్టీ రేటు 7 శాతం వరకూ ఉండొచ్చని అంచనాకు వచ్చింది. ఇండియాకు సంబంధించిన ఇటీవలి డేటా లేకపోవడంతో గ్లోబల్​ పావర్టీపై దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయాన్ని అంచనా వేయలేకపోయామని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

For More News..

బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్నస్కూల్ యాజమాన్యాలు

ఆస్తుల మ్యుటేషన్ బంద్.. అయోమయంలో కొనుగోలుదారులు

అక్టోబర్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవద్దు