తనిఖీల్లో రూ. 21 కోట్ల విలువైన బంగారం సీజ్

తనిఖీల్లో రూ. 21 కోట్ల విలువైన బంగారం సీజ్

మణిపూర్ లోని ఇంపాల్ లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు. కారులో స్మగ్లింగ్ చేస్తుండగా 43.12 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.20.95 ఉంటుందన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం రావడంతో డీఆర్ఐ గౌహతి జోనల్ యూనిట్ ఆపరేషన్ చేపట్టింది. ఇంఫాల్ నగరానికి సమీపంలో జూన్ 16న ఉదయం తెల్లవారుజామున వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలోని ఇంటిరియర్ బాక్సులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో 260 బంగారం బిస్కట్లను పట్టుకున్నారు. ఈ బాక్సులను తీయడానికి అధికారులకు దాదాపు  18 గంటల సమయం పట్టింది.