
గోట్కీ: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని గోట్కీ జిల్లాలో సోమవారం ఉదయం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో 30 మంది వరకు ప్రయాణికులు మృతి చెందారని, చాలా మందికి గాయాలయ్యాయని సమాచారం. మిల్లత్ ఎక్స్‌ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయని గోట్కీ జిల్లా పోలీసు ఆఫీసర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్‌లను సమీప గ్రామస్థులు, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు కలసి ఆస్పత్రులకు చేర్చామని చెప్పారు. పాక్‌లో ఇలాంటి ట్రెయిన్ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతుంటాయని సమాచారం. కానీ వీటిపై ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ పెద్దగా దృష్టి చూపలేదని తెలుస్తోంది. సిగ్నలింగ్ విధానంతోపాటు ట్రాకింగ్ వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యం చూపడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని తెలిసింది.