- రెండు రోజులుగా భారీ వర్షాలు
గౌహతి: అస్సాంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సౌత్ అస్సాం బరాక్ వ్యాలీ రీజన్‌లోని మూడు జిల్లాల్లో కొండచరియలు పడి 20 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. కాచర్ జిల్లాలో ఏడుగురు, హైలాకండీలో ఏడుగురు, కరీమ్‌గంజ్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో దాదాపు 3.72 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోవల్‌పరా, నాగాన్, హోజై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెప్పారు.