రూ.3 లక్షల స్పోర్ట్స్ బైక్.. కార్ల రేంజ్ ఫీచర్లు  

రూ.3 లక్షల స్పోర్ట్స్ బైక్.. కార్ల రేంజ్ ఫీచర్లు  

ధరలు కొండెక్కినా  సరే.. స్పోర్ట్స్ బైక్స్ విక్రయాలు కొంచెం కూడా తగ్గడం లేదు. దీంతో స్పోర్ట్స్ బైక్ ల తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి  విడుదల చేస్తున్నాయి. ప్రధానంగా యువత అభిరుచులకు అనుగుణంగా కొంగొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈక్రమంలోనే కేటీఎం కంపెనీ సరికొత్త మోడల్ ను విడుదల చేసింది. దాని పేరు ‘కేటీఎం ఆర్ సీ 390’. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.3.14 లక్షలు. ధరకు తగ్గట్టే దీని లుక్, ఫీచర్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభిస్తోంది. ఈ బైక్ పై అత్యాధునిక డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది.సాధారణంగా కార్లలోనే ఉండే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ను.. ‘కేటీఎం ఆర్ సీ 390’ బైక్ లోనూ అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా జారుడుగా, ప్రమాదకరంగా ఉండే రోడ్డు మార్గాల్లో టైర్ల పై సులువైన నియంత్రణ సాధ్యమవుతుంది. ఫలితంగా బైక్ స్కిడ్ అయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. 

ఆ రెండు సెన్సర్లు ఏం చేస్తాయంటే.. 

కార్నరింగ్ యాంటీ లాకిండ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అనే ఇంటర్నల్ మెజర్మెంట్ యూనిట్ సెన్సర్లు కూడా ఈ  బైక్ లో ఉంటాయి. ఒక్కో వీల్ లో చెరో సెన్సర్ ఉంటాయి. వీల్ ఎంతవేగంతో తిరుగుతోందనే విషయాన్ని.. ఈ సెన్సర్లు అత్యంత కచ్చితత్వంతో గ్రహిస్తాయి. ఉదాహరణకు బైకర్ అత్యంత వేగంగా వెళ్తూ, అకస్మాత్తుగా ఏదో ఒకవైపునకు మలుపు తీసుకుంటే.. ఆ దిశను సెన్సర్లు  అంచనా వేస్తాయి. వెంటనే బైక్ బ్రేకింగ్ పవర్ ను తగ్గించేసి, వీల్ లాక్ పడకుండా చేస్తాయి. ఈ కారణం వల్ల బైకర్ అత్యంత సులువుగా రోడ్లపై మలుపులను తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఒకవేళ కార్నరింగ్ ఏబీఎస్ ఫీచర్ లేకుంటే.. బైకర్ ఆకస్మిక మలుపు తీసుకోగానే టైర్లు లాక్ అయిపోయి, బైక్ కిందపడిపోయే ముప్పు ఉంటుంది. సూపర్ మోటో మోడ్ అనే మరో ఫీచర్ కూడా ‘కేటీఎం ఆర్ సీ 390’లో ఉంది. దీనికి సంబంధించిన ఒక బటన్ ద్వారా బైక్ ఫ్రంట్  బ్రేక్ లోని యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను ఆన్, ఆఫ్ చేయొచ్చు. క్విక్ షిఫ్టర్ + అనే మరో ఫీచర్ కూడా ‘కేటీఎం ఆర్ సీ 390’లో అందుబాటులో ఉంది. బైక్ గేర్లు మార్చేటప్పుడు క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేసే పరిజ్ఞానమే  క్విక్ షిఫ్టర్ +. 

మరిన్ని వార్తలు.. 

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీంలో పీకే మాజీ సహచరుడు
పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?