2023లోనూ ఇండ్ల అమ్మకాల జోరే... : జేఎల్​ఎల్​ ఇండియా

2023లోనూ ఇండ్ల అమ్మకాల జోరే... : జేఎల్​ఎల్​ ఇండియా

న్యూఢిల్లీ: ఇన్​ఫ్లేషన్​ తగ్గుముఖం పట్టడంతో 2023 లోనూ రెసిడెన్షియల్​ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతుందని జేఎల్​ఎల్​ ఇండియా వెల్లడించింది. 2022లో ఈ సేల్స్​ 68 శాతం పెరిగినట్లు పేర్కొంది. కస్టమర్లకు ఈ ఏడాది బిల్డర్లు  మంచి డీల్స్​ ఆఫర్​ చేస్తారని, ఫలితంగా సేల్స్​ మొమెంట్​ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022లో మొత్తం 2,15,666  రెసిడెన్షియల్​ ఇండ్లు అమ్ముడయినట్లు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఈ అమ్మకాలు 1,28,064 యూనిట్లేనని పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాన సిటీలు ముంబై, ఢిల్లీ–ఎన్​సీఆర్​, బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై, కోల్​కతా, పుణెలలో రెసిడెన్షియల్​ ఇండ్ల అమ్మకాలను తాము ట్రాక్​ చేస్తున్నట్లు జేఎల్​ఎల్​ వివరించింది. రెసిడెన్షియల్​ అపార్ట్​మెంట్ల డేటా మాత్రమే ఇందులో ఉందని, రో హౌస్​లు, విల్లాలు వంటివి కలపలేదని కూడా తెలిపింది.

ఇన్​ఫ్లేషన్ తగ్గుతున్న నేపథ్యంలో 2023లోనూ రెసిడెన్షియల్​ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతుందని జేఎల్ఎల్​ అంచనా వేస్తోంది. ఎక్కువ టెనూర్​తో లోన్లు, ఆకర్షణీయమైన రేట్లు వంటివి బయ్యర్లను ఈ ఏడాది ఆకట్టుకుంటాయని పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగినా 2022లో ఇండ్ల అమ్మకాలు పెరగడం గమనించాలని జేఎల్ఎల్​ ప్రస్తావించింది. దేశపు ఎకానమీ పటిష్టంగా ఉండటంతో ఇండ్ల సేల్స్​ ఊపు బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు జేఎల్​ఎల్​ ఎండీ​ శివ కృష్ణన్​ చెప్పారు. సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక దేశంలో చాలా మందికి కలగడం వల్లే డిమాండ్​ పెరుగుతోందని సిగ్నేచర్​ గ్లోబల్​ ఛైర్మన్​ ప్రదీప్​ అగర్వాల్​ పేర్కొన్నారు.  హౌసింగ్​ సెక్టార్​కు ఊతమిచ్చేలా రాబోయే బడ్జెట్​ ఉండాలని చెప్పారు.