26 మంది నేవీ సెయిలర్లకు కరోనా

26 మంది నేవీ సెయిలర్లకు కరోనా

ముంబయి: ఇండియన్ నేవీకి చెందిన 26 మంది సెయిలర్లకు కరోనా సోకింది. వీరందరినీ ముంబైలోని నేవీ హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉంచారు. నేవీలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వెస్టర్న్ నావల్ కమాండ్ కు లాజిస్టికల్, పరిపాలన సేవలు అందించే ఐఎన్ఎస్ ఆంగ్రె కు చెందిన వసతి గృహాల్లో ఈ నావికులు ఉండేవారని, వీరికి కాంటాక్ట్ లోకి వచ్చినవారిని ట్రేస్ చేస్తున్నట్లు నేవీ తెలిపింది. ఐఎన్ఎస్ ఆంగ్రె కు వందల మీటర్ల దూరంలోనే వెస్టర్న్ నావల్ కమాండ్ కు చెందిన యుద్ధనౌకలు, సబ్ మెరీన్లు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 3,320 కరోనా కేసులు నమోదు కాగా, ఎక్కువ మంది బాధితులు ముంబైలోనే ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో కూడా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫ్రాన్స్ కు చెందిన చార్లెస్ డీ గాలే యుద్ధనౌకలో 1,081 మంది సిబ్బంది, యూఎస్ కు యుద్ధనౌక థియోడర్ రూస్ వెల్ట్ లో 660 మందికి కరోనా సోకింది.