గోల్డ్ షాపులో భారీ చోరీ..27 తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు

గోల్డ్ షాపులో భారీ చోరీ..27 తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు
  • నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన  

మిర్యాలగూడ, వెలుగు :  గోల్డ్ షాపులో గుర్తు తెలి యని దుండగులు భారీ చోరీకి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. గోల్డ్ వ్యాపారి, వాడపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రంలో విజయశ్రీ గోల్డ్ షాప్ ను కాలే బ్రహ్మయ్య నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తన మొబైల్ కు షాపులోని సీసీ కెమెరాల సిగ్నల్ రాలేదు. అనుమానం వచ్చి వెంటనే షాపు వద్దకు  వెళ్లాడు. 

షాపు వెనక నుంచి కిటికీని పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి సుమారు 27 తులాల బంగారు నగలు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. వెంటనే బాధితుడు వాడపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  రూరల్ సీఐ పీఎన్ డీ ప్రసాద్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం నల్గొండ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ డీఎస్పీ రాజశేఖర రాజు షాప్ లో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సమీప షాపుల్లోని సీసీ ఫుటేజ్ లను చెక్ చేసి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి పోలీసులు చెప్పారు.