హైదరాబాద్ లో ఒక్కరోజే 3 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్ లో ఒక్కరోజే 3 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా  సైబరాబాద్ పరిధిలో చాలా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు 12వందల 41 కేసులు పెట్టారు. మియాపూర్ సర్కిల్ లో ఎక్కువగా 253 కేసులు పెట్టారు పోలీసులు. తర్వాత కూకట్ పల్లిలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల నుంచి 35 వయసు ఉన్నవాళ్లపై అత్యధికంగా 536 కేసులు ఫైల్ చేశారు. 

మరోవైపు టు వీలర్ బైకర్స్ పై ఎక్కువగా 938 కేసులు, త్రి వీలర్స్ డ్రైవర్స్ పై 21 కేసులు, ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ పై 275 కేసులు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా కేసులు.. రాచకొండ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్  కేసులు నమోదయినట్లు   పోలీసులు తెలిపారు.