జాన్సన్​ నుంచి 3 వేల టైల్​ డిజైన్స్

జాన్సన్​ నుంచి 3 వేల టైల్​ డిజైన్స్

హైదరాబాద్, వెలుగు:  సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) హైదరాబాద్‌లో శనివారం మూడు వేల కొత్త టైల్ డిజైన్‌‌లను ప్రదర్శించింది.  వీటిలో అన్ని చోట్లకు సరిపోయే టైల్స్​ఉన్నాయని తెలిపింది.  అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్‌‌ను ఒకే గొడుగు కింద డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. తమ టైల్స్​ నెగటివ్ అయాన్లను విడుదల చేయడం ద్వారా   సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయని పేర్కొంది. దీనివల్ల నివాసితులకు ఒత్తిడి తగ్గుతుందని ప్రకటించింది. ఆవిష్కరణలకు తమ కంపెనీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ విజయ్ మిశ్రా చెప్పారు. హెచ్ ఆర్ అండ్​ జాన్సన్  టైల్స్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్‌‌లు ఇంజనీర్డ్ మార్బుల్, క్వార్ట్జ్‌‌లను అందిస్తుంది.