కాళేశ్వరంలో టెండర్లు లేకుండా ..30 వేల కోట్ల పనులు

కాళేశ్వరంలో టెండర్లు లేకుండా ..30 వేల కోట్ల పనులు
  •     ఒకే సంస్థకు కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ 
  •     మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు 
  •     త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనుల్లో జరిగిన మెగా స్కామ్​పై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్​ పెట్టింది. ఇటీవల ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులపై జరిపిన దాడుల్లో పలు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం.. ఆ ఫైళ్లను జల్లెడ పడ్తుండగా, కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థకు రూ.30 వేల కోట్ల విలువైన పనులను ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్​పద్ధతిలో అప్పగించినట్లు ఆఫీసర్లు గుర్తించారు.  ప్రధానంగా మూడో టీఎంసీ పనుల్లోనే ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో అంచనా వ్యయం భారీగా పెరగడం వెనుక కారణాలేమిటనే అంశాలపై ఆరా తీస్తున్నారు.  

టెండర్లు లేకుండానే పనులు అప్పగింత.. 

రూ.30 వేల కోట్ల విలువైన కాళేశ్వరం అడిషనల్​టీఎంసీ పనులను ఎలాంటి టెండర్లు లేకుండా నాటి సర్కార్ తనకు కావాల్సిన కాంట్రాక్ట్​సంస్థకు కేటాయించినట్లు తాజాగా జరిపిన విజిలెన్స్​తనిఖీల్లో బయటపడింది. కేంద్రం నుంచి ఎలాంటి పర్మిషన్​లేకుండా చేపట్టిన అడిషన్​టీఎంసీ పనుల తీరును కాగ్​తప్పుపట్టినప్పటికీ, సదరు కాంట్రాక్ట్​ సంస్థకు వేల కోట్ల బిల్లులు చెల్లించేశారు. నిజానికి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.కోటి విలువ చేసే పని చేయాలన్నా, ఇంజనీర్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్లు‌‌‌‌‌‌‌‌ పిలుస్తారు. వచ్చిన టెండర్లలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్​సంస్థతో అగ్రిమెంట్​పూర్తి చేసి పనులు అప్పగిస్తారు. ఈ క్రమంలో సవాలక్ష నిబంధనలు విధిస్తారు. అలాంటిది కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్ హయాంలో ఇలాంటివేవీ పాటించకపోవడం విజిలెన్స్​ఆఫీసర్లను ఆశ్చర్యానికి గురిచేసినట్లు చెప్తున్నారు. మూడో టీఎంసీ పనుల్లోనే భారీ స్కామ్ జరిగిందని, ఆ గుట్టును రట్టు చేసే పనిలో ఇప్పుడు విజిలెన్స్​తలమునకలైందని ఇరిగేషన్​సర్కిల్స్​లో చర్చ జరుగుతోంది. 

లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‒1, లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‒2లలో పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ ల దగ్గర అదనపు మోటార్ల ఏర్పాటు దగ్గరి నుంచి పైపులైన్లు, కెనాల్స్​తవ్వకాలు, ఇందుకోసం చేసిన ఖర్చులో  భారీగా అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున కాకుండా 3 టీఎంసీల చొప్పున తీసుకెళ్లేలా ముందే ప్రాజెక్టును ఎందుకు డిజైన్​చేయలేదని, అలా డిజైన్​ చేస్తే రెండేసి పైపులైన్లు, రెండేసి కెనాల్స్​ తవ్వాల్సిన పని ఉండేదే కాదని, తద్వారా వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్​ఎంక్వైరీలో ఇలాంటి ఎన్నో విషయాలు బయటపడ్తుండగా, త్వరలోనే సర్కారుకు నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది.

భారీగా పెరిగిన అంచనా వ్యయం..  

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​హయాంలో చేపట్టిన ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్​రీడిజైనింగ్​పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. రూ.38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును కాదని, రూ.80 వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్లాన్​ చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర  2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్ భూమి పూజ చేశారు. రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా ఏడు లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 28 ప్యాకేజీలుగా పనులు ప్రారంభించారు. మూడేండ్ల తర్వాత ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తయినట్లుగా ప్రకటించి.. 2019 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కనీసం రెండు, మూడేండ్ల పాటు ఈ రెండు టీఎంసీలను ఎత్తిపోసి, ఆ సక్సెస్​రేట్​ఆధారంగా మూడో టీఎంసీ పనులు ప్రారంభించాలని ఇంజినీర్లు చెప్పినా.. అప్పటి ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. 

కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు రానప్పటికీ  కాళేశ్వరం ప్రారంభం రోజే  అడిషనల్​(మూడో) టీఎంసీ పనులు ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న టైమ్​కే పనులు పూర్తయినప్పటికీ, ఆశ్చర్యంగా ప్రాజెక్టు అంచనా వ్యయం మాత్రం భారీగా పెరిగిపోయింది. రెండు టీఎంసీల పనుల కోసం రూ.94,413 కోట్లు, అదనపు టీఎంసీ కోసం  రూ.33,459 కోట్లు కేటాయించడంతో రూ.80 వేల కోట్లతో పూర్తవుతుందనుకున్న ప్రాజెక్టు అంచనా వ్యయం కాస్తా రూ.1,27,872 కోట్లకు చేరింది. ఇందులో ఇప్పటివరకు రూ.93,872 కోట్లు ఖర్చు చేయగా, ఏమాత్రం ప్రయోజనం లేని మూడో టీఎంసీ పనులకే రూ.20,372 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.