ఇరాన్‌‌ నిరసనల్లో 36,500 మంది మృతి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద నరమేధం

ఇరాన్‌‌ నిరసనల్లో 36,500 మంది మృతి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద నరమేధం

ఇరాన్ లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన నిరసనలు, ఆందోళనల్లో 36,500 మంది మరణించినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 400 సిటీల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 

    
న్యూఢిల్లీ: ఇరాన్ నిరసనల్లో వేలాది మంది చనిపోయినట్టు తాజా రిపోర్టు బయటపెట్టింది. ఈ నెల 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో 36,500 మంది మరణించినట్టు వెల్లడించింది. 400 సిటీల్లో బలగాలు జరిపిన కాల్పుల్లో వీళ్లంతా చనిపోయారని తెలిపింది. ఇరాన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మారణహోమం అని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నివేదిక విడుదల చేసింది. 

వివిధ సంస్థల నుంచి ప్రభుత్వానికి అందిన డాక్యుమెంట్లు, ఫీల్డ్ రిపోర్టులు, హాస్పిటల్ రికార్డులు, బాధిత కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ  రిపోర్టును తయారు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ‘‘ఆందోళనల్లో 27,500 మంది చనిపోయినట్టు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీకి ఈ నెల 21న అందిన నివేదికలో ఉంది. ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఈ నెల 22న సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిన రిపోర్టులో 33 వేల మందికి పైగా చనిపోయినట్టు తెలిపింది. 

మళ్లీ 24న అందజేసిన రిపోర్టులో 36,500కి పైగా మరణించినట్టు వెల్లడించింది” అని వివరించింది. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారు. అమెరికా దాడి చేయొచ్చని మిలటరీ అధికారులు హెచ్చరించడంతో.. ఆయన టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సురక్షిత బంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి దాక్కున్నట్టు తెలుస్తున్నది.