
పంట వేస్తే రైతుకు నష్టం... వేయకపోతే సామాన్యులకు భారం... పండిన పంటకు మద్దతు ధర లేక.. నాణ్యత సరిగా లేదని రైతులను దళారులు దోచుకుంటారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే పంట దిగుబడి తగ్గి.. ధర అమాంతం పెరుగుతుంది. రైతుల నుంచి రూపాయికో.. అర్దరూపాయికో కొన్న దళారులు వందకో.. రెండొందలకో అమ్ముకొని రైతుని నిలువునా దగా చేస్తున్నారు. ఇప్పుడు అలానే మహారాష్ట్రలో ఉల్లి రైతుల పరిస్థితి అలానే ఉంది. వర్షాభావం లేక... గతేదాడి సాగు చేసిన విస్తీర్ణం కంటె 40 శాతం తక్కువుగా సాగు చేశారు. దీంతో ఈ ఏడాది ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు.
ప్రతి ఏడాది అత్యధికంగా ఉల్లి పంటను పండించే మహారాష్ట్ర రైతులు ... ఈ ఏడాది మాత్రం ఉల్లి పంటను సాగు చేయలేదు. దీంతో ఉల్లి పంట విస్తీర్ణం 40 శాతం తక్కువగా నమోదైందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో నాశిక్, ధులే, నందుర్బార్ , జల్గావ్ జిల్లాల్లో ఆనియన్ సాగు బాగా తగ్గింది. సాధారణంగా ఉల్లి పంటను నవంబర్ నుంచి జనవరి మధ్యలో నాటేస్తారు. మార్చి నెలలో పంట కోత ప్రారంభమవుతుంది.
గతేడాది ఉత్తర మహారాష్ట్రలోని పైన తెలిపిన నాలుగు జిల్లాల్లో ఉల్లి సాగును మొత్తం 2.50 లక్షల హెక్టార్లను సాగు చేశారు. అత్యధికంగా నాశిక్ జిల్లాలో 2.21 లక్షల హెక్టార్లలో సాగు చేసి 53 లక్షల టన్నుల ఉల్లిని పండించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువ నమోదు కావడంతో ఫిబ్రవరి 5 వరకు వరకు వేసవి ఉల్లి విస్తీర్ణం...ఉత్తర మహారాష్ట్ర జిల్లాల్లో 1.50 లక్షల హెక్టర్లలో మాత్రమే ఉల్లిని సాగు చేశారు. నాశిక్ జిల్లాలో 1.26 లక్షల హెక్టార్లలో ఆనియన్ పంటను పండించారు. గతేడాది కంటె 40 శాతం మంది తక్కువ రైతులు ఉల్లిని సాగుచేశారు.
సాధారణంగా వేసవి ఉల్లి ఆరు నెలల కంటె ఎక్కువ కాలం ఉండటంతో మంచి ధర లభించే అవకాశం ఉంటుందని రైతులు ఉల్లి పంటను సాగు చేయడంలో ఆశక్తి చూపుతారు. రైతులు హోల్సేల్మార్కెట్లలో విక్రయిస్తారు. మే నుంచి అక్టోబర్ వరకు కొత్త ఉల్లి పంట లేనందున రైతులు నిల్వ చేసిన ఉల్లికి ఈ కాలంలో భారీగా డిమాండ్ ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. గతేడాది వర్షాకాలంలో వర్షాలు కురవడంతో ఉత్తర మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో వేసవి ఉల్లి సాగు ...గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం తగ్గింది. నాసిక్ ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం. గతేడాది (2022-23) నాసిక్ జిల్లాలో వేసవి ఉల్లి సాగు 2.21 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది (2023-24) వేసవి ఉల్లి సాగు 1.26 లక్షల హెక్టార్లకు తగ్గింది. ధూలే జిల్లాలో వేసవి ఉల్లి సాగు గతేడాది 16 వేల హెక్టార్లు కాగా ఈ ఏడాది 14 వేల 326 హెక్టార్లకు తగ్గింది.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
జలగావ్ జిల్లాలో వేసవి ఉల్లి సాగు గతేడాది 9వేల 481 హెక్టార్లు కాగా ఈ ఏడాది 6 వేల841 హెక్టార్లకు తగ్గింది. నందుర్‌బార్ జిల్లాలో వేసవి ఉల్లి సాగు గతేడాది 2 వేల 108 హెక్టార్లు కాగా ఈ ఏడాది 2 వేల 826 హెక్టార్లకు పెరిగింది. వేసవిలో ఉల్లి సాగు తగ్గడంతో ఈ ఏడాది 35 లక్షల టన్నులకు తగ్గుతుందని అంచనా. ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపి ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.