వారంలో 42 వేల క‌రోనా టెస్టులు మా టార్గెట్

వారంలో 42 వేల క‌రోనా టెస్టులు మా టార్గెట్

దేశ రాజ‌ధాని ఢిల్లీని క‌రోనా క‌కావిక‌లం చేస్తోంది. రోజూ భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డుతున్నారు. నిన్న‌ ఒక్క రోజులోనే 186 మందికి వైర‌స్ సోకింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసులు సంఖ్య 1893కి చేరింది. అందులో 42 మంది మ‌ర‌ణించ‌గా.. 72 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో దాదాపు 65పైగా వైర‌స్ కంటైన్మెంట్ జోన్లను గుర్తించింది కేజ్రీవాల్ స‌ర్కార్. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గానే వేగంగా టెస్టులు చేయ‌డం ద్వారా మాత్ర‌మే క‌రోనా వ్యాప్తిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయొచ్చ‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. ఇందు కోసం భారీగా టెస్టు కిట్ల‌ను స‌మ‌కూర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ ప్ర‌భుత్వం 42 వేల ర్యాపిడ్ క‌రోనా టెస్టు కిట్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి సాయంతో వేగంగా టెస్టులు చేస్తామ‌ని చెసేందుకు రెడీ అవుతోంది.

ఒక్క‌ వారంలో..

ఢిల్లీకి 42 వేల క‌రోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్. ఎల్ఎన్జేపీ హాస్పిట‌ల్ లో ఈ టెస్టు కిట్ల ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించి, ప్ర‌జ‌ల‌కు ప‌రీక్ష‌లు మొద‌లుపెడ‌తామ‌ని తెలిపారాయ‌న‌. ఒక్క వారం రోజుల్లోనే 42 వేల టెస్టులు పూర్తి చేయాల‌ని తాము టార్గెట్ గా పెట్టుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.