450 మిలియన్లకు జియో యూజర్లు.. నెలకు 11 వందల కోట్ల GB డేటా హాంఫట్..

450 మిలియన్లకు జియో యూజర్లు.. నెలకు 11 వందల కోట్ల GB డేటా హాంఫట్..

జియో నెట్వర్క్ వాడకం విపరీతంగా పెరిగింది. జియో టెలికం కంపెనీ 450 మిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నట్లు  రిల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏజీఎంలో ప్రకటించారు. దీంతో నెలకు 1,100 Cr GB డేటా యూజర్లు వినియోగిస్తున్నారని తెలిపారు. గతేడాది తో పోల్చుకుంటే యూజర్లు 20 శాతం పెరిగారని ముఖేష్ అంబానీ అన్నారు. 

సగటున ప్రతి వినియోగదారు ఇప్పుడు ప్రతి నెల 25 గిగాబైట్‌ల కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 45శాతం వృద్ధిని సూచిస్తుందన్నారు.  మేడ్ ఇన్ ఇండియలో టెక్నాలజీతో రాబోయే రోజుల్లో భారత్ లో నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదాయ వృద్ధిని పెంచేందుకు దృష్టి సారించినట్లు తెలిపారు.