
పంజాగుట్ట, వెలుగు : బేగంటపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 461 అర్జీలు అందాయి. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 139, మైనార్టీ సంక్షేమం కోసం105, రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు 74, సివిల్ సప్లై విభాగానికి 54 ఫిర్యాదులు అందాయి. మిగతా 89 జీరో కరెంట్‌బిల్, ఆరోగ్యశ్రీ, లేఅవుట్కబ్జాలకు సంబంధించి వచ్చాయని అధికారులు చెప్పారు.
తాము అర్హులమైనా జీరో కరెంట్బిల్లుకు సంబంధించి విద్యుత్‌శాఖ నుంచి ఎటువంటి సమాచారం రాలేదంటూ కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్పర్యవేక్షణలో అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.