డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

ఉత్తరప్రదేశ్ లో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. బరేలీలోని హోటల్ లో ఒ బర్త్ డే పార్టీకి ప్రభాత్ ప్రేమి అనే వ్యక్తి హాజరయ్యాడు. ఆయన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. హోటల్ లో నిర్వహించిన పార్టీలో ప్రభాత్ బాలీవుడ్ సాంగ్స్ కు స్టెప్పులేశాడు.

అది చూసి అంతా విజిల్స్, కేకలతో ప్రభాత్ ను ఎంకరేజ్ చేశారు. అయితే.. ఉన్నట్టుండి ప్రభాత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పార్టీలో ఉన్న అతని స్నేహితులు సీపీఆర్, కార్డియాక్ ప్రెజర్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు హాస్పిటల్ తీసుకెళ్లగా.. అప్పటికే కార్డియాక్ అరెస్ట్ తో అతను చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.