కెరీర్ లో మార్పు కోరుకుంటున్నారా..! అయితే ఈ ఐదు టిప్స్‌‌ మీ కోసమే..

కెరీర్ లో మార్పు కోరుకుంటున్నారా..! అయితే ఈ ఐదు టిప్స్‌‌ మీ కోసమే..
కరోనా వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే దాదాపు 20 మిలియన్ల మంది అన్‌‌ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్‌‌ తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతున్నాయి. లాక్‌‌డౌన్ ముగియడం, పలు దేశాల్లో వ్యాక్సిన్‌‌లు అందుబాటులోకి రావడంతో కంపెనీల ఉత్పత్తి స్థాయి పెరిగింది. అయినప్పటికీ ఇంకా చాలా సంస్థలు లిమిటెడ్ ఎంప్లాయీస్‌‌తోనే నడుస్తున్నాయి. ట్రావెల్, హాస్పిటాలిటీ (ఆతిథ్యం) లాంటి రంగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగార్థులు కొత్త ఏడాదిలో కొంగొత్త అవకాశాలను వెతుక్కుంటూ సరికొత్త కెరీర్‌‌ల వైపు మరలుతున్నారు. కరోనా కారణంగా గత ఏడాది రెండో క్వార్టర్‌‌లో కెరీర్‌‌లు మారిన వారి సంఖ్య సుమారు 20 శాతం అని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఔట్‌ప్లేస్‌‌మెంట్ ఫర్మ్ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్‌‌మస్ ప్రకారం.. కొత్త ఏడాదిలో తొలి క్వార్టర్‌‌లో కెరీర్‌‌ మారే వారి సంఖ్య 15 శాతానికి పైగా ఉండొచ్చునని అంచనా. ఈ నేపథ్యంలో కెరీర్ మార్పు గురించి ఆలోచించే వారికి ఏరియల్ లోపెజ్, లటెషా బైర్డ్ లాంటి ప్రముఖులు పలు సూచనలు చేస్తున్నారు. 1. మీరు కోరుకునేదేదో మీకు తెలుసా? కొత్త జాబ్ ఓపెనింగ్స్‌‌కు మీ రెజ్యూమ్‌‌ను పంపే ముందు ఓ విషయంపై స్పష్టతకు రావాలి. మీ కెరీర్‌లో మీకు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయొద్దని అనుకుంటున్నారు లాంటి అంశాలపై పూర్తి క్లారిటీతో ఉండాలి. ఏ వర్క్ ఎన్విరాన్‌‌మెంట్‌‌లో పని చేయాలనుకుంటున్నారు, ఎలాంటి టీమ్స్‌‌తో కలసి వర్క్ చేయాలనుకుంటున్నారు లాంటి వాటితో ఓ లిస్ట్‌ను తయారు చేసుకోవాలి. ఎంత శాలరీ కావాలి, ఎలాంటి ప్రయోజనాలు కావాలనుకుంటున్నారు, ఏ పొజిషన్‌‌కు రీచ్ అవ్వాలనుకుంటున్నారో కూడా ముందే ఆలోచించుకోవాలి. 2. మీ ప్రొఫెషనల్ బ్రాండ్‌‌ను అప్‌‌డేట్ చేయండి కొత్త ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్‌‌లో చేరాలనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా రెజ్యూమ్‌‌ను అప్‌‌డేట్ చేసుకోవాలి. ఆన్‌‌లైన్ అప్పీయరెన్స్ కూడా చాలా ముఖ్యం. రెజ్యూమ్, లింక్డ్‌‌ఇన్ ప్రొఫైల్స్‌ను అప్‌‌డేట్ చేయాలి. మీ సోషల్ మీడియా అకౌంట్స్, బయోలో ఏముందనేది కూడా కీలకమే. మీ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఇలాంటివి ముఖ్యమని గుర్తుంచుకోండి. లింక్డ్‌‌ఇన్ లాంటి ప్రొఫైల్స్‌‌ను మీ ఆలోచనలకు తగ్గట్లుగా మార్చుకుంటూ రిక్రూటర్స్‌కు మంచి ఇంప్రెషన్ కలిగించొచ్చు. టార్గెట్ కంపెనీలకు తగ్గట్లుగా రెజ్యూమ్‌‌ను క్రియేట్ చేయాలి. 3. జాబ్‌‌కు తగ్గట్లుగా ట్రెయినింగ్ ఉండాల్సిందే ప్రొఫెషనల్ బ్రాండ్‌‌ను అప్‌‌డేట్ చేసుకోవడంతోపాటు రీసెర్చ్ కూడా కీలకం. జాబ్ మార్పునకు అవసరమైనట్లుగా కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవడం, అవసరమైన ట్రెయినింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. తగినంత సమయాన్ని కేటాయించడం ద్వారా కొత్త స్కిల్స్‌ను త్వరగా అలవర్చుకోవచ్చు. కరోనా కారణంగా చాలా మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోవడంతో Coursea, Udacity లాంటి ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌‌ఫామ్స్ ఫ్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గూగుల్ అయితే డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌‌మెంట్, యూఎక్స్‌‌లో లక్ష మందికి స్కాలర్‌షిప్స్, ఆన్‌‌లైన్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. వీటిని వినియోగించుకుంటే చాలా బెటర్. 4. ఎందుకు మారుతున్నారో తెలుసా? కొత్త కెరీర్ దిశగా వెళ్తున్నప్పుడు అసలు అటువైపుగా ఎందుకు వెళ్తున్నారనే దానిపై పూర్తి క్లారిటీ ఉండాలి. పాత ఇండస్ట్రీని వదలడానికి కారణాలు, అక్కడి అనుభవాలను ఇంటర్వ్యూలో స్పష్టతతో చెప్పగలగాలి. ఏ ఇండస్ట్రీలోనైనా కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్, క్లయింట్ రిలేషన్స్, సమస్యలను పరిష్కరించడం, వినూత్నంగా ఆలోచించడం ముఖ్యమని తెలుసుకోవాలి. ఇలాంటి స్కిల్స్‌‌ను రెజ్యూమ్‌‌తోపాటు ఇంటర్వ్యూలోనూ చూయించడానికి యత్నించాలి. 5. నెట్‌‌వర్క్‌ను పెంచుకోవడం తప్పనిసరి కొత్త వాళ్లతో పరిచయం పెంచుకోవాలి. ఆన్‌‌లైన్ నెట్‌‌వర్కింగ్‌‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో లింక్డ్‌‌ఇన్ కీలకమని గుర్తుంచుకోవాలి. వర్చువల్ కాన్ఫరెన్స్‌లు, ఈవెంట్స్‌‌కు అటెండ్ అవుతూ నెట్‌‌వర్క్‌ను పెంచుకోవాలి. ఇప్పటికే కంపెనీలు, ఇండస్ట్రీలు మారిన వారితో కాంటాక్ట్‌‌లో ఉండాలి. తద్వారా మనపై మనకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అలాగే మనకు సూటబుల్ అవకాశాలు ఉంటే తెలుసుకునే చాన్సెస్ ఉంటాయి.