తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు..

తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గురువారం నాటి కేసుల కన్నా ఇవి 13శాతం తక్కువ. నిన్న 1,36,962 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 804 మంది మృతి చెందారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు 5,07,981 మంది కొవిడ్ బారినపడి మరణించారు. 
దేశంలో ప్రస్తుతం 6,10,443 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 172,29,47,688 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం కొత్తగా 977 కరోనా కేసులు నమోదయ్యయాయి. డిసెంబర్ 29 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కొవిడ్ కేసులు తగ్గడంతో మధ్యప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ సహా కరోనా నిబంధనలన్నీ ఎత్తివేస్తున్నట్లు  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. 

For more news..

ఉత్తరాఖండ్లో మళ్లీ కంపించిన భూమి

స్కూళ్లు మూణ్నెళ్లే ఉన్నా..జాయిన్ చేస్తున్నరు